Whats App కొత్త ఫీచర్.. సేఫ్టీ లాగిన్ కోసం పాస్కీలు

Whats App కొత్త ఫీచర్.. సేఫ్టీ లాగిన్ కోసం పాస్కీలు

Whats App మేసేజింగ్ యాప్ వినియోగదారులకు రోజుకో కొత్త ఫీచర్ను పరిచయం చేస్తోంది. సేఫ్టీ విషయంలో  కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కోసం WhatsApp పాస్ కీ లను విడుదల చేస్తుంది. భద్రత, లాగిన్ సులభతరం చేసేందుకు Whats App ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. 

ఆండ్రాయిడ్ వినియోగదారులు ఈ ఫీచర్ లో సులభంగా, సురక్షితంగా లాగిన్ కావొచ్చిన Whats App ప్రకటించింది. ఫేస్, ఫింగర్ ప్రింట్స్, పిన్ లాక్ ద్వారా మాత్రమే Whats App   అకౌంట్ ఓపెన్ చేయగలరు. 

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం WhatsApp పాస్‌కీ లాగిన్‌లను విడుదల చేస్తుంది. ఈ పాస్ కీలు మొదట్లో టెస్టింగ్ దశలో ఉండగా.. ప్రస్తుతం సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఐ ఫోన్లలో వాట్సప్ పాస్ కీలయాక్సెస్ ఇంకా రాలేదు. ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరో కొన్ని  వారాల్లో అందుబాటులోకి వస్తాయి. ఈ పాస్ కీలు మీ మొబైల్ లో ఇప్పుడు వాడుతున్న పాస్ వర్డ్ లకు ప్రత్యామ్నాయంగా పనిచేయనున్నాయి. 

Also Read :- రాయల్​ఓక్​లో ఫెస్టివల్​ ఆఫర్లు

యాపిల్, గూగుల్ వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే ఈ పాస్ కీలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి. గతవారంనుంచి గూగుల్ వినియోగదారులకు పాస్ కీలు అందుబాటులోకి వచ్చాయి. 

ఫేస్ స్కాన్, ఫింగర్ ప్రింట్, పిన్ ద్వారా పాస్ కీలను వినియోగించవచ్చు. ఇప్పుడు ఉపయోగించే పాస్ వర్డ్ ల కంటే 40 శాతం వేగవంతం, భద్రతను పెంచుతాయి.  WhatsApp పాస్ కీ ఫీచర్ ను పరిచయం చేయడం ద్వారా ఖాతా భద్రత, సౌలభ్యం పెంచుతోంది.