వాట్సాప్ కొత్త ఫీచర్.. యాప్లోనే కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు

వాట్సాప్ కొత్త ఫీచర్.. యాప్లోనే కాంటాక్ట్స్ యాడ్ చేయొచ్చు

ప్రముఖ మెసేంజింగ్ యాప్ వాట్సాప్.. యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్, ఫీచర్స్ తీసుకొస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా వాట్సాప్ అప్లికేషన్లోనే కాంటాక్ట్స్ యాడ్ చేసుకునే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అంతేకాకుండా సేవ్ చేసిన కాంటాక్ట్ ని ఎడిట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది. గతంలో వాట్సాప్ యూజర్లు ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేయాలంటే.. కాంటాక్ట్స్ యాప్ లోకి వెళ్లి సేవ్ చేసేవాళ్లు. ఈ అప్ డేట్ ద్వారా ఇప్పుడు నేరుగా వాట్సాప్ లోనే సేవ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నీ ఈ ఫీచర్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.