technology :  వాట్సాప్​లో స్క్రీన్ షేరింగ్​

technology :  వాట్సాప్​లో స్క్రీన్ షేరింగ్​

వాట్సాప్​లో లేటెస్ట్​గా స్క్రీన్ షేరింగ్​ ఫీచర్ వచ్చింది. ఇకపై స్క్రీన్​ షాట్స్ తీసి పంపడం, డాక్యుమెంట్స్​ షేర్ చేసే అవసరం లేకుండా ఈ ఫీచర్​ వాడితే సరిపోతుంది. అందుకోసం ముందుగా వాట్సాప్​ని అప్​డేట్ చేయాలి. తర్వాత యాప్​లోకి వెళ్లి కాంటాక్ట్​ సెలక్ట్ చేసుకుని, వీడియో కాల్ చేయాలి. అవతల వాళ్లు కాల్​ లిఫ్ట్​ చేశాక, మీ ఫోన్​లో వీడియో కింద కుడివైపున షేరింగ్​ సింబల్​ కనిపిస్తుంది. దానిపై ట్యాప్​ చేస్తే ‘స్టార్ట్ నౌ’ అని వస్తుంది. దాని మీద ట్యాప్​ చేయగానే మీ ఫోన్​లో ఉన్న స్ర్కీన్​ అవతలి వాళ్ల ఫోన్​లో కూడా కనిపిస్తుంది. మీ ఫోన్​లో ఏ యాప్స్ ఓపెన్​ చేసినా వాళ్ల ఫోన్​లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్స్ ఫైల్స్​ ఏవైనా చూడాలనుకుంటే వెంటనే ఓపెన్ చేసి చూపించొచ్చు.

ఏవైనా ప్రజెంటేషన్స్ రెడీ చేస్తే వాటిని కూడా లైవ్​లో చూపించి, కరెక్షన్స్ తెలుసుకోవచ్చు. అలాగే టెక్నాలజీ​ ఇన్​ఫర్మేషన్​ కావాలంటే కొందరికి ఫోన్​లో చెప్తే అర్థం కాదు. అలాంటప్పుడు వీడియో కాల్ చేసి, స్ర్కీన్​ షేరింగ్ ద్వారా వాళ్లకు అర్థమయ్యేలా చూపిస్తూ చెప్పొచ్చు. పని పూర్తయ్యాక స్క్రీన్​ షేరింగ్​ ఆపడానికి ‘స్టాప్’ అనే ఆప్షన్​ మీద ట్యాప్ చేయాలి. ఇప్పటికే ఈ ఫీచర్ బీటా వెర్షన్​లో వాడకంలో ఉంది. ప్రస్తుతం అందరికీ అందులోబాటులోకి తీసుకొచ్చింది.