
వాట్సాప్‌లో గ్రూప్ చాట్, బిజినెస్‌కి సంబంధించిన సమాచారం ఎవరో ఒకరితోనే మాట్లాడుకోవాలంటే ఫోన్ నెంబర్లు షేర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌తో చెక్ పెట్టేసింది. ఈ ఫీచర్ ద్వారా ఇతరులతో ఈజీగా మాట్లాడుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదు. ఈ ఫీచర్ ఎలా వాడాలంటే.. యూజర్లు అందులోని రూల్స్ ప్రకారం పేరును సెలక్ట్ చేసుకోవాలి. స్మాల్ లెటర్స్, నెంబర్లు, డాట్స్ మాత్రమే ఉండాలి.
కాకపోతే యూజర్ నేమ్స్ ‘www’తో స్టార్ట్ అవ్వకూడదు. ఒకసారి యూజర్ నేమ్ క్రియేట్ చేశాక కాన్ఫెట్టి యానిమేషన్ చూడొచ్చు. వాట్సాప్ యూజర్ తమ యూజర్ నేమ్ మార్చుకుంటే ప్రొఫైల్ పిక్చర్ లేదా నెంబర్ చేంజ్ లాగానే చాట్లలో సిస్టమ్ నోటిఫికేషన్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.