వాట్సాప్లో హై క్వాలిటీ ఫొటోలు పంపుకోవచ్చు

వాట్సాప్లో హై క్వాలిటీ ఫొటోలు పంపుకోవచ్చు

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లని తీసుకొస్తుంటుంది. తాజాగా యూజర్లకోసం మరొక కొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. వాట్సాప్ లో హై క్వాలిటీ ఫొటోలు నేరుగా పంపించడం చాలా కష్టం. దానికోసం ఫొటోలు సెలక్ట్ చేసి డాక్యుమెంట్లో పంపాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు తీసుకొస్తున్న ఈ ఫీచర్ ద్వారా నేరుగా హై క్వాలిటీ ఫొటోలు పంపుకోవచ్చు. కాకపోతే ఈ ఫీచర్ ప్రస్తుతం డెస్క్ టాప్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుంది. డెస్క్ టాప్ లాగిన్ అయి అక్కడి నుంచి నేరుగా ఫొటోలు పంపుకోవచ్చు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే మొబైల్ కి తీసుకురాబోతున్నారు.