వాట్సాప్‌ లో కొత్త ఫీచర్

వాట్సాప్‌ లో కొత్త ఫీచర్

స్మార్ట్‌ ఫోన్ ఉందంటే దానిలో వాట్సాప్‌ లేకుండా ఉండే చాన్సే లేదు! దాదాపు ప్రతి స్మార్ట్‌ ఫోన్ యూజర్‌‌ వాట్సాప్ వాడుతున్నారు. మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, లొకేషన్.. ఇలా ఏదైనా సెకన్లలో షేర్‌‌ చేసకునేందుకు ఈ యాప్‌ను చిన్నా పెద్ద అంతా వాడేస్తున్నాం. ఈ యాప్‌ను ఫేస్‌బుక్‌ (మెటా) కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్‌ చేస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఉన్న వాట్సాప్‌ వెబ్ ఆప్షన్‌ను కొత్త మెరుగులు దిద్దింది. ప్రస్తుతం వాట్సాప్‌ వెబ్‌ వాడాలంటే ఫోన్‌లో కచ్చితంగా నెట్‌ ఆన్‌లో ఉండాల్సిందే. ఒకసారి వాట్సాప్‌ వెబ్‌లో లాగిన్ చేసినా సరే ఆ తర్వాత కంప్యూటర్‌‌/ల్యాప్‌టాప్‌లో దాని వాడకం కంటిన్యూ చేయాలంటే ఫోన్ కనెక్ట్ ఉండక తప్పదు. ఫోన్‌ ఆన్‌లైన్‌ కనెక్టివిటీ లేకుంటే వాట్సాప్‌ వెబ్‌లో మెసేజ్‌లు పంపినా అవి అవతలి వ్యక్తికి డెలివరీ కావు. కానీ ఇకపై ఆ అవసరం లేదు. ఒక్కసారి ఫోన్‌తో వాట్సాప్‌ వెబ్‌ కనెక్ట్‌ చేసి.. ఆ తర్వాత మొబైల్‌లో నెట్‌ ఆఫ్‌ చేసినా సరే కంప్యూటర్‌‌లో దానిని వాడుకోవచ్చు. ఇలా ఫోన్‌లో నెట్ ఆన్‌ చేయకుండా 14 రోజుల పాటూ నిరాటంకంగా వాట్సాప్‌ వెబ్‌ వాడేయొచ్చు. మెసేజ్‌లు పంపడమే కాదు.. వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. 14 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా అది లాగౌట్‌ అయిపోతుంది.

ట్రయల్‌ సక్సెస్‌.. కావడంతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..

ఇప్పటికే ఈ ఫీచర్‌‌ కొన్ని స్మార్ట్‌ ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. అయితే బీటా వెర్షన్‌ టెస్టింగ్‌లో భాగంగా అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌.. ఆ ప్రయోగాలు సక్సెస్‌ కావడంతో అన్ని ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ ఫోన్లలో ఇకపై ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇది బీటా వెర్షన్‌ గానే కొనసాగుతోంది. దీని వాడాలనుకుంటే ముందుగా వాట్సాప్‌లో కుడి వైపు టాప్‌ కార్నర్‌‌లో ఉండే మూడు చుక్కలను క్లిక్‌ చేసి, లింక్డ్‌ డివైజెస్‌ ఆప్షన్‌ ఓపెన్ చేయాలి. అందులో బీటా వెర్షన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానికి ఓకే చేస్తే మొబైల్‌ నెట్‌ లేకుండా వాట్సాప్‌ వెబ్‌ వాడుకోవచ్చు. ఆ తర్వాతి నుంచి లింక్డ్‌ డివైజెస్‌లోకి వెళ్లి వాట్సాప్‌ వెబ్‌ కనెక్ట్ చేసి, ఆపై ఫోన్‌లో నెట్‌ ఆపేసి వెబ్‌ వెర్షన్‌లో మెసేజ్‌లు చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత వాట్సాప్‌ వెబ్‌లో లాగౌట్‌ చేయడం మర్చిపోయినా.. ఫోన్‌లో లాగౌడ్‌ చేయొచ్చు.

మరిన్ని వార్తల కోసం..

కేదార్‌‌నాథ్‌ ఆలయం మూసివేత

డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీని సర్‌ప్రైజ్ చేసిన ధోని 

కళ్లు ఎప్పుడు పీకేస్తున్నారు? కేసీఆర్‌ను ప్రశ్నించిన షర్మిల