త్వరలో వాట్సాప్ గ్రూప్ లో 1024 మంది!!

త్వరలో వాట్సాప్ గ్రూప్ లో 1024 మంది!!

వాట్సాప్ లో కొంగొత్త ఫీచర్లు సందడి చేస్తున్నాయి. వినియోగదారులకు ఎంతో సౌకర్యాన్ని చేకూరుస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక వాట్సాప్ గ్రూప్ లో గరిష్ఠంగా 512 మందే ఉండే అవకాశం ఉంది. త్వరలోనే ఆ లిమిట్ దాదాపు రెట్టింపు కానుంది. వాట్సాప్ గ్రూప్ లో దాదాపు 1,024 మందిని యాడ్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. సాధ్యమైనంత త్వరగా సాధారణ యూజర్లకూ ఈ అప్ డేట్ ఇవ్వాలని వాట్సాప్ యోచిస్తోంది.

వాట్సాప్ గ్రూపు సభ్యుల సంఖ్యను పెంచడమనేది చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారికి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తోంది. వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో ఒక్కో గ్రూపులో 256 మందిని యాడ్ చేసే అవకాశమే ఉండేది. ఆ తర్వాత గ్రూప్ మెంబర్ల సంఖ్యను 512కు పెంచారు. ఇప్పుడు మళ్లీ గ్రూప్ మెంబర్ల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది.