ఈ రోజు నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పని చేయదు

ఈ రోజు నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పని చేయదు

ఈ రోజు(ఫిబ్రవరి 1) నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. Android Eclair 2.3.7 లేదా దాని కంటే పాత వెర్షన్ మరియు IOS 8 లేదా అంత కంటే పాత వెర్షన్ల OS కలిగిన ఫోన్లలో మాత్రమే.  పాత ఓఎస్ కలిగిన ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని గతంలోనే ఫేస్ బుక్ యొక్క సొంత యాప్ వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఈ రెండు ఆపరేటింగ్ సిస్టంలు ఏడు సంవత్సరాల కంటే ముందు విడుదల చేయబడినవి కాబట్టి 2020 ఫిబ్రవరి 1 నుండి ఈ పాత OS లకు వాట్సాప్ సపోర్ట్ చేయదని వాట్సాప్ సంస్థ తెలిపింది.

Windows OS పై నడిచే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ ఇప్పటికే నిలిచిపోయింది. డిసెంబర్ 31వ తేదీకే ఈ సపోర్ట్ ను వాట్సాప్ నిలిపివేసింది. అయితే Jio ఫోన్ వినియోగదారులకు మాత్రం వాట్సాప్ ఎటువంటి షాక్ ఇవ్వలేదు. KaiOS 2.5.1కు తర్వాతి వెర్షన్లపై పనిచేసే అన్ని ఫోన్లపై వాట్సాప్ ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఈ ఫోన్లలో జియో ఫోన్, జియో ఫోన్ 2 కూడా ఉన్నాయి.

వాట్సాప్ అందించే  లేటెస్ట్ ఫీచర్లు పాత ఓఎస్ లలో లభించవు, అంతే కాకుండా ఆ ఫీచర్స్ ను  సపోర్ట్ కూడా చేయనందున కొత్త OS పై పనిచేసే ఫోన్లకు అప్ గ్రేడ్ అవ్వాలని వాట్సాప్ గతంలో సూచించింది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది  లేటెస్ట్ ఫోన్ లు, వాటితో పాటు లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంలు వాడుతున్నారు. కాబట్టి  ఈ మార్పు చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ పై  పెద్ద ప్రభావం చూపించదు.  పాత ఫోన్లు(Android Eclair 2.3.7, IOS 8 ) వాడుతున్న వారు మాత్రం వాట్సప్  సేవలను వాడాలంటే కొత్త ఫోన్ లకు మారక తప్పదు.

ఓల్డ్ వెర్షన్ OS లు ఉన్న వాట్సాప్ వినియోగదారులు తమ చాట్ మరియు కన్వర్జేషన్ ను కోల్పోకూడదనుకుంటే, వాటిని బ్యాకప్ సేవ్ చేయడానికి అండ్రాయిడ్, ఐ ఫోన్లలో  ఓ ఆప్షన్ ఉంది.

Android లో:

  •  Whatsapp ని ఓపెన్ చేసిన తర్వాత, మీ Android ఫోన్ యొక్క రైట్ సైడ్ టాప్ కార్నర్ లో 3 డాట్స్ పై క్లిక్ చేయాలి.
  •  ఆ తర్వాత Settings ఆప్షన్ క్లిక్ చేయాలి.
  •  ఆపై ‘Chats’ పై క్లిక్ చేయండి
  • అందులో ఉన్న ‘chat backup’ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు Google Drive Settings అనే ఆప్షన్ కన్పిస్తుంది.

మీరు చేసిన చాట్‌లన్నీ ఇప్పుడు ఆ గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేయబడతాయి

Iphone లో:

WhatsApp—->Settings—-> Chats——> Chat backup——->Back Up Now

‘Back Up Now’ ని క్లిక్ చేసిన తర్వాత మీరు చేసిన కన్వర్జేషన్ మరియు చాట్ మీ iCloud Drive లో సేవ్ అవుతుంది.

వాట్సాప్ సపోర్ట్ చేసే OSలు ఇవే :

  • Android OS 4.0.3+ ఆపరేటింగ్ సిస్టమ్
  • iPhone iOS 9+ వెర్షన్ ఉంటేనే పనిచేస్తుంది.
  • JioPhone and JioPhone 2 తో సహా KaiOS 2.5.1+ ఫోన్లలో వాట్సాప్ పని చేస్తుంది.

మరిన్ని వార్తలు

ఈ రోజు నుంచి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పని చేయదు

కొడుకు ప్రియురాలిపై తండ్రి అత్యాచారం

కరోనా వైరస్ : విషాదాన్ని నింపుతున్న వైరల్ వీడియో

లక్ష కోట్లకు వారసుడు.. 2 రూములున్న ఇంట్ల ఉంటున్నడు