వాట్సాప్ లో కొత్త ఫీచర్ - ఇకపై సెక్యూరిటీ మరింత పటిష్టం

వాట్సాప్ లో కొత్త ఫీచర్ - ఇకపై సెక్యూరిటీ మరింత పటిష్టం

మెసేజింగ్ విభాగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూ కస్టమర్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో మరో కొత్త ఫీచర్ ని వాట్సాప్ తీసుకురాబోతోంది. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో ఇప్పటికే మంచి సెక్యూరిటి ఫీచర్స్ ని అందిస్తున్న వాట్సాప్ ఇప్పుడు సెక్యూరిటీని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులేస్తోంది. ఇప్పుడున్న యాప్ లాక్ ఫీచర్ ని కొనసాగిస్తూనే, ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ వంటి ఫీచర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

టెస్టింగ్ లో ఉన్న ఆతెంటికేషన్ మెథడ్స్:

వాట్సాప్ బెటా ఇచ్చిన సమాచారం ప్రకారం యూజర్స్ కి అదనపు భద్రతను అందించటం కోసం ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్, డివైస్ పాస్వర్డ్ వంటి ఫీచర్స్ ని టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

మెరుగైన సెక్యూరిటీ:

ప్రస్తుతం ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పటిష్టంగా ఉన్నప్పటికీ కొన్ని లోపాల వల్ల యూజర్ డేటాకు ప్రమాదం ఉన్న కారణంగా ఇంకా మెరుగైన భద్రతా అందించేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్స్ ని తెస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వచ్చిన కొత్త ఫీచర్:

యూజర్ సెక్యూరిటీ విషయంలో వాట్సాప్ ఇటీవల కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మన వాట్సాప్ డీపీని ఇతరులు స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉండదు.

ఇతర ఫీచర్స్:

సెక్యూరిటీ విషయంలో కొత్త ఫీచర్స్ తో పాటుగా స్టేటస్ లో కాంటాక్ట్స్ ని మెన్షన్ చేసే ఆప్షన్ వంటి కొత్త ఫీచర్స్ ని వాట్సాప్ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది.