వైరల్ వీడియో : గాల్లోఉండగా ఊడిన విమానం టైర్

వైరల్ వీడియో : గాల్లోఉండగా ఊడిన విమానం టైర్

కెనడాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. కెనడాకు చెందిన ఓ ఎయిర్ పోర్ట్ నుంచి  బయలుదేరిన విమానం గాలిలో ఉండగా..టైర్ ఊడిపడింది. అయితే టైర్ ఊడిపోతుండగా ఓ ప్రయాణికుడు వీడియోతీసి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డాష్-8-300 విమానం కెనడాకు  మాంట్రియల్ సిటీలోని బాగాట్ విల్లే విమానశ్రాయం నుంచి 52మంది ప్రయాణికులకు బయలుదేరింది. విమానం ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా టైర్ ఊడిపడింది. అయితే టైర్ ఊడిపోయే సమయంలో టామ్ అనే ప్రయాణికుడు వీడియో తీశాడు. మరోవైపు విమానం టైర్ ఊడిపడిపోయినట్లు గుర్తించిన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఫ్లైట్ ను జాగ్రత్తగా ల్యాండింగ్ చేశాడు.