ఇంటర్మీడియేట్ ఫలితాలు ఎప్పుడంటే..?

ఇంటర్మీడియేట్ ఫలితాలు ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలో  ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించారు. పేప‌ర్‌ వాల్యూయేషన్ కూడా వేగంగా జ‌రుగుతోంది. ఈసారి పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరైయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈసారి  ఇంటర్ పరీక్షల మూల్యాంకాన్ని త్వరగా పూర్తి చేసి, ఫలితాలను కూడా త్వరగా విడుదల చేయాలని బోర్డ్ ప్రయత్నిస్తోంది. ఎంసెట్‫తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చూస్తోంది. వీలైతే ఏప్రిల్‌ మూడోవారం లేదా చివరి వారంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.