అధికారంలోకొస్తే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తం : అర్జున్ ముండా

అధికారంలోకొస్తే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తం : అర్జున్ ముండా

పోడు భూముల సమస్యలను రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోడం సిగ్గుచేటని కేంద్రమంత్రి అర్జున్ ముండా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబాను ఆయన దర్శించుకున్నారు. మెస్రం వంశీయుల చందాలతో ఆలయాన్ని నిర్మించడం హర్షణీయమన్నారు. నాగోబా ఆలయ అభివృద్ధికి కావాల్సిన నిధులను కేంద్రం మంజూరు చేస్తుందని చెప్పారు. నివేదికలు పంపండి అడవిలో ఉండే ఆదివాసీలకు ఆ అడవిపై పూర్తి హక్కు ఉంటుందని చెప్పారు. ఆదివాసీల సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రతి ఆదివాసీకి ఇళ్లు నిర్మించి ఇచ్చేలా కేంద్రం ప్రణాళిక చేసిందన్నారు.  ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత -బీజేపీకే దక్కుతుందన్నారు.