ఒత్తిడిలో తప్పు చేయడం సహజం

ఒత్తిడిలో తప్పు చేయడం సహజం

పాక్పై హాఫ్ సెంచరీ సాధించడం పట్ల కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. చాలా రోజుల తర్వాత ఫాంలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ..ధోనిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తాను టెస్టు కెప్టెన్నీ వదులుకున్నప్పుడు..ధోని మాత్రమే స్పందించి..తనను ఓదార్చాడని చెప్పుకొచ్చాడు. తన ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉన్నా..ఎవరూ మెసేజ్ చేయలేదన్నాడు. ఒక్క ధోని మాత్రమే తనకు మెసేజ్ చేశాడని భావోద్వేగానికి లోనయ్యాడు. 

మానసిక ఒత్తిడికి గురయ్యా..
ఫాం లేమితో  ఇబ్బంది పడ్డ రోజులను... కెప్టెన్సీగా విఫలమైన రోజులను  విరాట్ కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. సారథిగా విఫలమైన సమయంలో తాను మానసికంగానూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాని చెప్పాడు. అయితే  నెల రోజుల బ్రేక్ తర్వాత రీఫ్రెష్ అయ్యానని తెలిపాడు. విరామం వల్ల ఒత్తిడి దూరమైందని వివరించాడు.

ఒత్తిడిలో తప్పు చేయడం సహజం..
పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ అర్ష్ దీప్ సింగ్ క్యాచ్ వదిలేయడంపై కోహ్లీ స్పందించాడు. ఒత్తిడిలో ఎవరైనా తప్పు చేయవచ్చు, ఇది పెద్ద మ్యాచ్,  పరిస్థితులు కొంచెం కఠినంగా ఉన్నాయి. క్రమంగామ్యాచులు ఆడుతున్న కొద్దీ..ఒత్తిడిని జయిస్తారు. యంగ్ ప్లేయర్లు..సీనియర్ ఆటగాళ్ళ నుంచి నేర్చుకుంటారు. మరోసారి అవకాశం వచ్చినప్పుడు..,కీలక క్యాచ్‌లు వదిలేయరు. 

విమర్శలకు కోహ్లీ కౌంటర్..
2019 తర్వాత కోహ్లీ ఆటతీరు సరిగా లేదు. సెంచరీలు కాదు కదా..కనీసం పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు.  ఫాం లేమితో తంటాలు పడుతూ..క్రీజులో నిల్చోవడానికే తంటాలు పడిన పరిస్థితి. దీంతో ఇంటా బయటా విమర్శలెదుర్కొన్నాడు. కోహ్లీ పనైపోయింది...జట్టు నుంచి తప్పించాలన్న డిమాండ్ వినిపించింది. వాటన్నింటికి కోహ్లీ సింపుల్గా కౌంటర్ ఇచ్చాడు. నాకు ఇస్తున్న సలహాలు ముఖ్యం కావు. నేను ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే.. ఆ వ్యక్తిని పర్సనల్‌గా రీచ్ అవుతాను. అందరి ముందు బహిరంగంగా మీరు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే.. నేను వాటికి విలువ ఇవ్వను’ అని స్పష్టం చేశాడు. 

విరాట్ ఈజ్ బ్యాక్..
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత నెల రోజులు బ్రేక్ తీసుకున్న కోహ్లీ..ఎట్టకేలకు ఆసియాకప్లో ఫాంలోకి వచ్చాడు. పాకిస్తాన్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 35 పరుగులు చేసిన కోహ్లీ..హాంకాంగ్తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక తాజాగా సూపర్ 4లో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్లో రికార్డు హాఫ్ సెంచరీ కొట్టాడు. కోహ్లీ సాధించిన 60 పరుగులు టీమిండియా 181 పరుగుల లక్ష్యాన్ని పాక్ ముందు ఉంచడంలో దోహదపడ్డాయి.