చియా గింజలు నానబెట్టుకుని తినేవాళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!

చియా గింజలు నానబెట్టుకుని తినేవాళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!

చాలా మంది చియా గింజలను నానబెట్టుకుని తింటుంటారు. కానీ.. ఉదయం పూటనే చియా గింజలు తినడం వల్లనే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. చియా గింజలను నానబెట్టడం వల్ల పీచు పదార్థం ప్రయోజనాలు పొందుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

జీర్ణ సమస్యలను నివారించడానికి రోజుకు 1 టేబుల్ స్పూన్‌ చియా గింజలు తినండి. నీళ్లు ఎక్కువగా త్రాగండి. రోజులో ఏ సమయంలోనైనా చియా గింజలను తినొచ్చు. కానీ ఉదయాన్నే తినడం వల్ల, తాగడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఉదయం కాల కృత్యాలు తీర్చుకోగానే.. బ్రష్ చేసి నానబెట్టిన చియా గింజలను తినడం వల్ల.. జీవ క్రియకు, ఆకలి నియంత్రణకు మరింత మేలు జరుగుతుంది. అల్పాహారంలో కూడా చియా పుడ్డింగ్ లేదా ఓట్‌మీల్తో పాటు చియా గింజలను తీసుకోవచ్చు. అంతేకాకుండా.. వాటిలోని ఫైబర్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. చియా గింజలను భోజనంతో పాటు కలిపి కూడా తినొచ్చు.

►ALSO READ | రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కుండీలో ఫ్రెష్ పుదీనా పెంచడం ఇంత ఈజీనా ?

భోజనంతో పాటు చియా గింజలు తినడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్టుండి పెరిగే అవకాశం లేకుండా నియంత్రణలో ఉంటాయి. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్లు ఆహారం తక్కువ తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. అయితే.. తినమన్నారు కదా అని చియా గింజలను ఎక్కువగా తీసుకున్నా ఇబ్బందే.

చియా గింజలను ఎక్కువగా తింటే.. ఫైబర్ స్థాయికి మించి శరీరంలో పెరిగిపోయి.. గ్యాస్, మలబద్ధకంతో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. అందుకే.. చియా గింజలను ఒకేసారి తినకండి. గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తినండి. అప్పుడే జీర్ణ సమస్యలు దరిచేరవు. శరీరానికి తగినంత నీరు అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.