
‘యానిమల్’ సినిమా ట్రైలర్ చూస్తే మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజినల్ ట్రైలర్‌ను ఇప్పటివరకూ చూడలేదు’ అన్నారు మహేష్ బాబు. సోమవారం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రణ్‌బీర్‌కు తాను పెద్ద అభిమానినని, ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని మహేష్ విష్ చేశారు.
మరో అతిథి రాజమౌళి మాట్లాడుతూ ‘సినిమా ఫార్ములాను షేక్ చేసే దర్శకులు అరుదుగా వస్తుంటారు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా అలా వచ్చారు. తనను చూస్తుంటే గర్వంగా ఉంది’ అన్నారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.