పోలింగ్కు ముందా.. తర్వతా.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడుతయ్ ?

పోలింగ్కు ముందా.. తర్వతా.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడుతయ్ ?

రైతుబంధు పంపిణీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 24వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయం జమ చేసుకోవచ్చని చెప్పింది. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్​ఫర్) చేస్తున్నందున రైతుబంధు ప్రభావం ఓటర్లపై ఉండదని తెలిపింది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు రైతుబంధు సాయం పంపిణీపై ప్రభుత్వం ఇటీవల ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది.  తాజాగా దీనిపై  బదులిచ్చిన ఈసీ.. రైతుబంధు పంపిణీకి ఓకే చెప్పింది. అయితే ఇంకా రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల డీఏల చెల్లింపులకు ఈసీ నుంచి అనుమతి రాలేదు. 

రైతుబంధు పంపిణీపై  గందరగోళం 

రైతుబంధు పంపిణీపై వ్యవసాయ శాఖ నుంచి విడుదలైన ప్రకటన గందరగోళానికి దారితీసింది. ఈ నెల 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు హాలిడేస్ ఉన్నాయని, ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రైతు బంధు సాయం పంపిణీని 28న ఒక్క రోజుకే పరిమితం చేస్తారా? లేదా 29, 30 తేదీల్లో కూడా వేస్తారా? అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. లేకపోతే ఎన్నికలు ముగిశాకే రైతుల అకౌంట్లో జమ చేస్తారో చూడాలి.