పాక్​ బార్డర్​లో సర్జికల్ స్ట్రైక్స్​కు ఆధారాలు ఎక్కడ? : దిగ్విజయ సింగ్

పాక్​ బార్డర్​లో సర్జికల్ స్ట్రైక్స్​కు ఆధారాలు ఎక్కడ? : దిగ్విజయ సింగ్
  • కాంగ్రెస్ నేత దిగ్విజయ సింగ్

జమ్మూ: 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి, పాకిస్తాన్‌‌పై చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి కేంద్రం ప్రూఫ్స్​ఎందుకు ఇవ్వడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ ప్రశ్నించారు. జమ్మూలో  రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడారు. పుల్వామాలో 40 మంది జవాన్లు చనిపోయారని, ప్రభుత్వం ఇప్పటి వరకు పార్లమెంటుకు ఆధారాలు చూపించలేదన్నారు. టెర్రరిజానికి  కేంద్రంగా ఉన్న పుల్వామాలో ప్రతి కారును చెక్​ చేస్తారని, ఆ రోజు రాంగ్ సైడ్ నుంచి వచ్చిన స్కార్పియో కారును ఎందుకు చెక్ చేయ‌‌లేదని ఆయన ప్రశ్నించారు.

అది ఢీకొని 40 మంది జవాన్లు చనిపోయారని చెప్పా రు. ఇప్పటి వరకు దీనిపై ప్రభుత్వం ప్రూఫ్ ​ఇవ్వలేదన్నారు. 300 కిలోల ఆర్డీఎక్స్​ టెర్రరిస్టుల చేతికి ఎలా వచ్చిందన్నారు. సర్జికల్ స్ట్రైక్ గురించి కూడా ఎటువంటి ఆధారాల్లేవని విమర్శించారు. కాగా, దిగ్విజయ్​ వ్యాఖ్యలతో కాంగ్రెస్​కు సంబంధంలేదని పార్టీ ఎంపీ జైరామ్​ రమేశ్​ తేల్చిచెప్పారు. దిగ్విజయ్​ వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయాలేనని, సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతుగా నిలిచిందని జైరామ్​ రమేశ్​ గుర్తుచేశారు.