వేములవాడ ఎమ్మెల్యే యాడ వున్నాడో.. జర చెప్పురి సీఎం సారు

వేములవాడ ఎమ్మెల్యే యాడ వున్నాడో.. జర చెప్పురి సీఎం సారు

వేములవాడ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని కోరారు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఆది శ్రీనివాస్ . గత ఆరు నెలలుగా వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కనిపించకుండా పోయారని ఆరోపించారు. మఖ్యమంత్రి కెసిఆర్ గారు మీరైనా వేములవాడ ఎమ్యేల్యే అచూకీ తెలపాలని ట్విట‌ర్ ద్వారా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పై చర్యలు తీసుకుంటున్న ప్ర‌భుత్వం.. శాసనసభ సమవేశాల్లో ప్రజా సమస్యల పై మాట్లాడడానికి రాలేని మీ ఎమ్యేల్యే చెన్నమనేని రమేష్ బాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను అడిగారు.

కరోనా సహా అనేక సమస్యలతో వేములవాడ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కనీసం సమస్యలు చెప్పకుందామంటే ఎమ్యేల్యే ఇంటికి తాళం వేసి ఉంటుందని అన్నారు. ప్ర‌జ‌ల‌ను పట్టించుకునే ప్రజాప్రతినిధి కరువయ్యారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తాను ముమ్మాటికి భారతీయుడినే అంటూ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ జర్మనీ పాస్ పోర్ట్‌పైన ప్రయాణం చేస్తున్న ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.