Tamannaah: తమన్నా బీరు ఫ్యాక్టరీ పెట్టిందా? లేదా? ఆసక్తిరేపుతున్న మిల్క్ బ్యూటీ కొత్త ఐడియా!

Tamannaah: తమన్నా బీరు ఫ్యాక్టరీ పెట్టిందా? లేదా? ఆసక్తిరేపుతున్న మిల్క్ బ్యూటీ కొత్త ఐడియా!

హీరోయిన్ తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘డూ యూ వానా పార్ట్‌నర్’. ఇందులో మిల్క్ బ్యూటీ ఒక బ్రూవరీ స్టార్టప్‌ని మొదలుపెట్టి, మగాళ్ల ప్రపంచంలోకి అడుగుపెట్టే ఒక మహిళ పాత్రలో నటించింది.

‘కొలిన్ డి కున్హా’, ‘అర్చిత్ కుమార్’ అనే ఇద్దరు డైరెక్టర్లు ఈ సిరీస్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 12 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్స్గా రన్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో టాప్ 10 మూవీస్లో ఒకటిగా దూసుకెళ్తుంది. 

ఇందులో తమన్నాతో పాటుగా డయానా పెంటీ, జావేద్ జాఫ్రీ, శ్వేతా తివారీ, సూఫీ మోతీవాలా, నీరజ్ కబీ, ఇంద్రనీల్ సేన్‌‌గుప్తా కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కథనం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాధారణంగా మగవాళ్ళు డామినేట్ చేసే ఆల్కహాలిక్ డ్రింక్స్ పరిశ్రమలోకి మహిళలు అడుగుపెట్టే కథను ఆసక్తిగా చూపించారు డైరెక్టర్స్. 

కథేంటంటే:

శిఖా రాయ్ చౌదరి (తమన్నా) గుర్గావ్‌‌లో ఉద్యోగం చేస్తుంటుంది. కానీ.. తన బాస్‌‌ విక్రమ్ వాలియా (నీరజ్ కబీ) ఆమెని అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. శిఖా తండ్రి (ఇంద్రనీల్ సేన్‌‌గుప్తా) క్రాఫ్ట్ బీర్ తయారు చేయాలని కలలు కనేవాడు. కానీ.. అతని కోరిక తీరకముందే చనిపోతాడు. అందుకే బీర్‌‌‌‌ కంపెనీ పెట్టి తన తండ్రి కలను సాకారం చేయాలని నిర్ణయించుకుంటుంది శిఖా.

అందుకోసం తన ప్రాణ స్నేహితురాలు, మార్కెటింగ్ ఎక్స్‌‌పర్ట్‌‌ అనహితా మకుజినా (డయానా పెంటీ)ని సాయం కోరుతుంది. ఇద్దరూ క్రాఫ్ట్ బీర్ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. కొన్ని సంవత్సరాల క్రితం శిఖా తండ్రికి ద్రోహం చేసిన లిక్కర్‌‌‌‌ వ్యాపారి (నీరజ్ కబీ) నుంచి బెదిరింపులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంతేకాకుండా ఇది లేడీస్ చేసే బిజినెస్ కాదంటూ, ఎవరూ వాళ్లతో డీల్ కుదుర్చుకోరు. దాంతో 'డేవిడ్ జోన్స్' అనే ఒక పాత్రను AI ద్వారా క్రియేట్ చేసి, అవతలివారిని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. వాళ్లు తీసుకున్న నిర్ణయం ఎలాంటి చిక్కుల్లో పడేస్తుంది? ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్లు కంపెనీ పెట్టారా? లేదా? ఈ సిరీస్‌ చూస్తే తెలుస్తుంది.