ఇండియన్​ టాయిలెట్ .. వెస్ట్రన్ టాయిలెట్​.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా

ఇండియన్​ టాయిలెట్ .. వెస్ట్రన్ టాయిలెట్​.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా

నాగరీకరణలో భాగంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే ఒకప్పుడు టాయిలెట్లు లేని ఊళ్లలో వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం పెరిగింది. పట్టణాల్లో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఇంట్లోనూ వెస్ట్రన్ టాయిలెట్లు వినియోగిస్తున్నారు. భారతీయ టాయిలెట్లను తక్కువగా వాడుతున్నారు. అయితే ఈ రెండు రకాల టాయిలెట్ల వాడకంపై చాలామందిలో అనేక అపోహలు ఉన్నాయి. అందుకే ఇందులో ఏ రకమైన టాయిలెట్ ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

దేశంలో ఒకప్పుడు బహిరంగ మరుగుదొడ్ల వాడటం ఎక్కువగా ఉండేది. తర్వాత మరుగుదొడ్లు నిర్మించుకోవడంపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాయి. దీంతో గ్రామాలు, పట్టణాలు అటువైపుగా అడుగులు వేశాయి. మొదట్లో గ్రామానికో టాయిలెట్ ఉండగా.. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ టాయిలెట్‌లు ఉన్నాయి.ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్ప.. ఎక్కడ చూసినా ఇప్పుడు మరుగు దొడ్ల వ్యవస్థ వచ్చింది. మొదట్లో గ్రామానికి ఓ మరుగు దొడ్ల నిర్మాణం ఉండేది. ఇందుకు ప్రభుత్వాలు కూడా ఎంతో తోడ్పడ్డాయి. ఆ తర్వాత క్రమ క్రమంగా ఇప్పుడు ఇంటికో బాత్ రూమ్ నిర్మాణాలు వచ్చాయి. ఈ బాత్రూమ్‌‌ల నిర్మాణాల్లో కూడా ఎన్నో కొత్త వెరైటీలు వచ్చాయి. 

క్రమంగా ప్రజలు విదేశీ కల్చర్ అనుసరించి ఇళ్లలో విదేశీ టాయిలెట్ కమోడ్‌లను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో వెస్ట్రన్ టాయిలెట్ వాడకంపై క్రేజ్ పెరిగింది. దీన్ని ఓ స్టేటస్‌గా చూపించే స్థాయికి కూడా ప్రజలు వచ్చారు. కానీ  ఉన్నప్పటికీ కొందరు దేశీయ టాయిలెట్లను ఇష్టపడతారు. వీటి వాడకం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెప్తున్నారు. వెస్ట్రన్ టాయిలెట్‌లు కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ వాటివల్ల అనేక నష్టాలు ఉన్నాయని హెచ్చిరిస్తున్నారు

ఇండియన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల..

భారతీయ టాయిలెట్లు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది. కూర్చోవడం, నిలబడటం అనేది వ్యాయామంగా పనిచేస్తుంది. వ్యాయామం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాకుండాఇది రక్త ప్రసరణను కూడా పెంచుతుంది. మీ చేతులు, కాళ్లకు చాలా మంచిది.  దేశీయ టాయిలెట్లపై కూర్చోవడాన్ని స్వాటింగ్ అంటారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కూర్చునే పొజీషన్ కడుపును పిండుతుంది. వెస్ట్రన్ టాయిలెట్‌ వల్ల కడుపుపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఈ టెయిలెట్ల వినియోగం వల్ల నీరు ఎక్కువగా వృధా అవుతుంది. గర్భిణీల ఆరోగ్యానికి దేశీయ టాయిలెట్లు మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రసవం సాఫీగా, సహజంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల..

వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధ పడేవారికి ఇది చాలా సౌకర్యవతంగా ఉంటుంది. వీటిని అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపయోగిస్తే చాలా ఉపశమనం పొందుతారు. కానీ ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా ఈ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఈ టాయిలెట్ యూజ్ చేయవడం వల్ల.. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. అతి సారం, కడుపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెస్ట్రన్ టాయిలెట్ చర్మానికి తగలడం వల్ల.. క్రిములు, బ్యాక్టీరియా అనేవి త్వరగా వ్యాప్తి చెందుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు త్వరగా వస్తాయి. కాబట్టి వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగిస్తే.. ఎప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్‌గా ఉంచుకునేలా చూసుకోవాలి