
గ్లామర్ రోల్స్ చేస్తూనే.. కథకు బలం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటుంది కేథరిన్ థ్రెసా. ‘వాల్తేరు వీరయ్య’లో రవితేజకి భార్యగా కనిపించి మెప్పించింది. తాజాగా ఆమె నుంచి మరో కొత్త అనౌన్స్‌మెంట్ వచ్చింది. జార్జిరెడ్డి, వంగవీటి చిత్రాలతో గుర్తింపు పొందిన సందీప్ మాధవ్‌కు జోడీగా కనిపించనుంది. ‘ఓదెల రైల్వేస్టేషన్’ ఫేమ్ అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దావులూరి జగదీష్, పల్లి కేశవరావు నిర్మిస్తున్నారు.
జులై చివరివారంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించనున్నట్టు, మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేథరిన్ వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది.