నాలుగు రోజుల్లో రెండు చోట్ల కల్తీ పాల గుట్టు రట్టు

నాలుగు రోజుల్లో రెండు చోట్ల కల్తీ పాల గుట్టు రట్టు
  • హైదరాబాద్‌‌ సరిహద్దు మండలాల్లో యథేచ్ఛగా తయారీ
  •     మిల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరాక్సడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలుపుతూ కృత్రిమ పాల తయారి
  •     పాలు పగలకుండా ఫార్మాల్డిహైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం
  •     అనారోగ్య సమస్యలు తప్పవంటున్న డాక్టర్లు

యాదాద్రి, వెలుగు : ఆరోగ్యానికి రక్షణగా నిలిచే పదార్థాల్లో పాలకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కుతుంది. కానీ కొందరు వ్యక్తులు కాసులకు కక్కుర్తి పడుతూ పోషకాహారమైన పాలను విషంగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తున్నామంటూ అందులో ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారు. ఈ అక్రమాలకు యాదాద్రి జిల్లా అడ్డాగా మారుతోంది. కొందరు వ్యక్తులు పాలు పగిలిపోకుండా శవాలను భద్రపరిచేందుకు వాడే కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడుతుంటే, మరికొందరు ఏకంగా నీళ్లలో రసాయనాలు కలిపి పాలుగా మారుస్తున్నారు. వీటిని ప్రతిరోజు తెల్లవారుజామునే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిహద్దు మండలాల్లో...

యాదాద్రి జిల్లాకు చెందిన, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అతి సమీపంలో ఉన్న మండలాలైన భూదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోచంపల్లి, చౌటుప్పల్, బొమ్మలరామారం, భువనగిరి, బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలాలు కల్తీ పాల తయారీకి అడ్డాలుగా మారుతున్నాయి. ఆయా మండలాల్లో తయారు చేసిన పాలను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్తూ హోటళ్లతో పాటు పలు ఇండ్లకు సప్లై చేస్తున్నారు. చౌటుప్పల్ మండలం రాధాపురం, బొమ్మలరామారం మండలం చౌదరిపల్లి, భువనగిరి మండలం బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిమ్మాపురంతో పాటు బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో కల్తీ, కృత్రిమ పాలను తయారీ యథేచ్ఛగా సాగుతోంది. కల్తీ పాల తయారీ కేంద్రాలపై ఆఫీసర్లు దాడులు చేస్తున్నా, నిందితులను కఠినంగా శిక్షించిన దాఖలాలు లేవు. దీంతో ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.

హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరాక్సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మాల్డిహైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడుతూ...

వివిధ రసాయలను వాడుతూ పాలను తయారు చేయడంతో పాటు, అవి పగిలిపోకుండా ఉండేందుకు శవాలకు ఉపయోగించే కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడుతున్న విషయం బయటపడడం యాదాద్రి జిల్లాలో కలకలం సృష్టించింది. చుక్కపాలను కూడా సేకరించకుండానే నీళ్లలో మిల్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైడ్రోజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరాక్సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైడ్రో క్లోరిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాసిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూరియా, సర్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బేకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోడా, వంట నూనె కలుపుతూ వందలాది కృత్రిమ పాలను తయారు చేయడం ఇటీవల యాదాద్రి జిల్లా బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిమ్మాపురంలో బయటపడింది. అలాగే పాలు ఎన్ని రోజులైనా పగిలిపోకుండా ఉండేందుకు శవాలను భద్రపరిచేందుకు ఉపయోగించే ఫార్మాల్డిహైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలుపుతున్న విషయం తాజాగా బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం కొండమడుగులో వెలుగుచూసింది. ప్రతి 50 లీటర్ల పాలకు రెండు లేదా మూడు చుక్కల ఫార్మాల్డిహైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడిన పాలను తాగడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ పాలు తాగిన వెంటనే వచ్చే ప్రమాదమేమీ లేకున్నా దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే చాన్స్‌‌ ఉంది. ఈ పాల వల్ల శ్వాస, జీర్ణకోశ, కాలేయ సంబంధమైన వ్యాధులతో పాటు మెదడుపై  తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. 

చర్యలు తీసుకుంటున్నం 

కృత్రిమంగా పాలు తయారు చేయడానికి కొందరు కెమికల్స్‌‌ వాడుతున్నారు. ఈ పాలు ఆరోగ్యానికి ప్రమాదకరం. కృత్రిమ, కల్తీ పాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నం. - స్వాతి, ఫుడ్‌‌ ఇన్స్‌‌పెక్టర్‌‌, యాదాద్రి జిల్లా