ఈడీ పేరుతో రేవంత్‌‌‌‌ను వేధిస్తే ఊరుకోం : అడ్లూరి లక్ష్మణ్

ఈడీ పేరుతో రేవంత్‌‌‌‌ను వేధిస్తే ఊరుకోం : అడ్లూరి లక్ష్మణ్
  • విప్‌‌‌‌ అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ఈడీని అడ్డంపెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డిని వేధిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని విప్ అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌లో  రేవంత్ పేరు ఉందని బీఆర్ఎస్, బీజేపీ తెగ హడావుడి చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని, ప్రశ్నించే వారి గొంతును నొక్కాలని చూస్తోందని ఆరోపించారు. 

దేశంలోనే గొప్ప సీఎంగా రేవంత్ రెడ్డికి పేరు వస్తుండటంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్నారు. తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వట్లేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. వరంగల్ సభలో కూడా కేసీఆర్ బీజేపీని ఒక్క మాట కూడా అనలేదని గుర్తుచేశారు. మాదిగలకు మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌‌‌‌ను కోరామని చెప్పారు.