ఐటీలో వైట్​కాలర్​ జాబ్స్​ తగ్గుతున్నయ్​

ఐటీలో వైట్​కాలర్​ జాబ్స్​ తగ్గుతున్నయ్​

ఐటీ సెక్టార్​లో రోజురోజుకూ వైట్​కాలర్​ జాబ్స్ తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులో 1.21 లక్షల ఖాళీలు ఉండగా, అక్టోబరులో వీటి సంఖ్య 12 శాతం తగ్గి 1.06 లక్షలకు పడ్డాయి. గత మూడేళ్ల డేటాను పరిశీలిస్తే..ఈ సంవత్సరం అక్టోబరులో ఇండియా వైట్​కాలర్ ​జాబ్స్​మార్కెట్లో ఐటీ జాబ్స్​వాటా 50 శాతం తగ్గిపోయిందని స్పెషలిస్ట్ స్టాఫింగ్​ ఫర్మ్​ ఫెనో తెలిపింది. లింక్​డ్​ఇన్​తోపాటు పలు టాప్​ కంపెనీల జాబ్​ బోర్డులను పరిశీలించగా, ఈ విషయం తెలిసిందని పేర్కొంది.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన మార్కెట్లలో ఆర్థికమాంద్యం సంకేతాలు కనిపిస్తుండటం, ధరల పెరుగుదల వంటి సమస్యల కారణంగా ఐటీ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి.  రిక్రూట్​మెంట్​ను చాలా వరకు తగ్గిస్తున్నాయి. మూడేళ్ల క్రితం డేటాతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబరులో వైట్​కాలర్స్​ జాబ్స్​ సంఖ్య 50 శాతం తగ్గింది. స్పెషలిస్ట్ స్టాఫింగ్​ ఫర్మ్​ ఫెనో  లింక్​డ్​ఇన్​తోపాటు పలు టాప్​ కంపెనీల జాబ్​ బోర్డుల డేటాను పరిశీలించి రిపోర్టును తయారు చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో యాక్టివ్​ జాబ్​ వేకెన్సీల సంఖ్య 12 శాతం తగ్గింది. ఇదే కాలంలో మొత్తం యాక్టివ్​ జాబ్​ ఓపెనింగ్స్ మాత్రం​ 2.10 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు పెరిగాయి. ఐటీ టెక్నాలజీలో సర్వీసులు, ప్రొడక్టులు, ఇంటర్నెట్​ ఎనబుల్డ్ సెక్టార్లు కలిసి ఉంటాయి. చాలా ఏళ్ల పాటు వైట్​కాలర్స్​ జాబ్స్​లో ఐటీ సెక్టార్​ హవా కొనసాగింది. దాదాపు 80 శాతం వైట్​కాలర్స్​ జాబ్స్ ఇదే సెక్టార్​ నుంచి వచ్చేవి! గ్లోబల్​ మార్కెట్లలో సమస్యల కారణంగా కంపెనీలు వైట్​కాలర్స్​ జాబ్స్ ఇవ్వడానికి జంకుతున్నాయి. టెక్​ సెక్టార్​ ఇక ముందు కూడా రిక్రూట్​మెంట్లను వాయిదా వేస్తూనే ఉంటుందని, ఆర్థికమాంద్యం, ఇన్​ఫ్లేషన్​, ఆదాయాల తగ్గుదల వంటి సమస్యలే ఇందుకు కారణమని ఫెనో తెలిపింది.

నాన్​టెక్​ సెక్టార్​లో పెరుగుతున్న జాబ్స్​

 అమెరికా, యూరప్​, జపాన్​, చైనా మార్కెట్లలో ఐటీ కంపెనీలకు గ్రోత్​ సమస్యలు ఉన్నాయని  మహీంద్రా గ్రూప్ చీఫ్​ ఎకనమిస్ట్​ సచ్చిదానంద్​ శుక్లా అన్నారు. ఐటీతోపాటు అనుబంధ సెక్టార్లకూ ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. వచ్చే క్యాలెండర్​ సంవత్సరం ముగిసే వరకూ పరిస్థితుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కొన్ని టెక్​ కంపెనీల్లో అవసరానికి మించి స్టాఫ్​ ఉన్నారని బ్యాంక్​ ఆఫ్ బరోడా చీఫ్​ఎకానమిస్ట్​ మదన్​శబ్నవిస్​ పేర్కొన్నారు.   టెక్ సెక్టార్  యాక్టివ్ వైట్ కాలర్ ఓపెనింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించుకుంటుండగా, నాన్-టెక్ సెక్టార్ కంపెనీల్లో పెరుగుతున్నాయి.