నిద్ర కోసం బైడెన్ సీప్యాప్ మెషీన్‌‌‌‌ వాడుతరు.. అందుకే ఆయన ముఖంపై గీతలు పడ్డయి

నిద్ర కోసం బైడెన్ సీప్యాప్ మెషీన్‌‌‌‌ వాడుతరు.. అందుకే ఆయన ముఖంపై గీతలు పడ్డయి

నిద్ర కోసం బైడెన్ సీప్యాప్ మెషీన్‌‌‌‌ వాడుతరు

అందుకే ఆయన ముఖంపై గీతలు పడ్డయి: వైట్ హౌస్ వెల్లడి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (80) నిద్రకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్ షికాగో పర్యటనకు బయలుదేరిన సమయంలో ఆయన ముఖంపై కొన్ని గీతలు కనిపించాయి. దీనిపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. వైట్ హౌస్ ఆఫీసర్లు బుధవారం క్లారిటీ ఇచ్చారు. బైడెన్ 2008 నుంచి స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస ఆగి, స్టార్ట్ కావడం)తో బాధపడుతున్నారని.. అందుకే ఆయన నిద్రపోయేటప్పుడు  సీప్యాప్(కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) మెషీన్‌‌ను వాడుతున్నారని వివరించారు.

సీప్యాప్ మెషీన్‌‌ ఓ మోటారు సాయంతో గాలిని శ్వాసనాళాల్లోకి పంపుతుందని చెప్పారు. ఇది పట్టీలతో కూడిన మాస్క్‌‌లా ఉంటుందని..దాన్ని ముఖానికి పెట్టుకుంటారని తెలిపారు. స్లీప్ అప్నియా వల్ల ఏర్పడే శ్వాస ఇబ్బందులు సీప్యాప్ తో తొలగుతాయని.. గురకను నివారించడానికి కూడా దీనిని వాడతారన్నారు. మంగళవారం రాత్రి కూడా బైడెన్ సీప్యాప్ ను వాడారని.. అందుకే ఆయన ముఖంపై గీతలు పడ్డాయని వైట్ హౌస్ అధికారులు  మీడియాకు వివరించారు.