వాషింగ్టన్ లోని వైట్ హౌజ్ లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. సాయుధుడైన ఓ వ్యక్తి సీక్రెట్ సర్వేస్ చెక్ పాయింట్ లోకి దూసుకెళ్లి అక్కడున్న సిబ్బందిపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది దుండుగుడిని కాల్చి చంపాయి. ట్రంప్ టార్గెట్ గా కాల్పులు జరిపేందుకు వైట్ హౌజ్ లోకి దుండగుడు ప్రవేశించనట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ దుండగుడు.. ఎందుకు ట్రంప్ ని టార్గెట్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
ఆదివారం (మే24) అమెరికాలోని వాషింగ్టన్ వైట్ హౌజ్ లో కాల్పులు జరిపిన దుండుగుడు తనను తాను ఏస్తుక్రీస్తుగా ప్రకటించుకున్న నసీర్ బెస్ట్ అనే 21 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. వైట్ హౌస్ వెలుపల ఉన్న భద్రతా చెక్‌పాయింట్ వద్ద కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. వెంటనే ఫెడరల్ భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం..బెస్ట్ 17వ స్ట్రీట్ నార్త్‌వెస్ట్ సమీపంలో అనుమానాస్పదంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. ఆ తర్వాత అతను రివాల్వర్‌ను బయటకు తీసి చెక్‌పాయింట్ వద్ద మోహరించి ఉన్న అధికారులపై పలుమార్లు కాల్పులు జరిపాడు.
సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే ఎదురు కాల్పులు జరిపి, అనుమానితుడిని అక్కడికక్కడే హతమార్చారు. ది న్యూయార్క్ పోస్ట్ ,సీబీఎస్ న్యూస్ ఉటంకించిన వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కాల్పులలో ఓ పౌరుడికి తీవ్రంగా గాయపడ్డాడు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరూ గాయపడినట్లు సమాచారం లేదు.ఇరాన్ తో దౌత్యపరమైన చర్చలు, పలు మిడిల్ ఈస్ట్ దేశాలతో ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఉండగా ఈ కాల్పుల ఘటన జరిగింది.
Video shows the massive police response near the White House amid reports that Secret Service personnel shot an individual during an unknown shooting incident.
— Noteworthy News (@newsnoteworthy) May 23, 2026
*Note: video below shows the moment several shots were fired. https://t.co/3qL5VDh56J pic.twitter.com/hfE3p60n6V
