మనుషులు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుంటారు. ఇది సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజులు వేడుకలు చేస్తుంటారు జంతుప్రేమికులు. తాము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న..లేదా ఇష్టపడుతున్న జంతువులకు బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తుంటారు. అయితే కొందరు ఓ పులికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశాఖపట్నం జూలో తెల్లపులి పీచు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఓ కాలేజీ విద్యార్థులతో జూ క్యూరేటర్ నందిని సలారియా కలిసి వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పీచుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులంతా తెల్లపులి మాస్కులు ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తన పుట్టిన రోజు వేడుకలను పులి పీచు ప్రత్యక్షంగా వీక్షించింది.
విశాఖ జూలో ఉన్న పులుల్లో పీచు ది అత్యంత చిన్న వయసు(5).