అగ్నిపథ్లో చేరమని మిమ్మల్ని ఎవరడిగారు..?

అగ్నిపథ్లో చేరమని మిమ్మల్ని ఎవరడిగారు..?
  • కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్

అగ్నిపథ్ స్కీంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారని ఆందోళనకారుల్ని ప్రశ్నించారు కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్. అగ్నిపథ్ స్కీం నచ్చకపోతే...దానిని ఎంచుకోవద్దని ఘాటుగా స్పందించారు. అగ్నిపథ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని కోరారు. సైనికులుగా చేరమని భారత సైన్యం బలవంతం చేయదని.. సైన్యంలో చేరాలనుకునే వారు తమ ఇష్టప్రకారం నిర్ణయం తీసుకోవచ్చన్నారు. బస్సులు, రైళ్లను తగలబెడుతున్నా వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేస్తేనే అగ్నిపథ్  ఎంపికచేస్తామని స్పష్టం చేశారు వీకే సింగ్. ఈ క్రమంలోనే 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిపథ్ గురించి ప్రస్తావన వచ్చిందని తెలిపారు వీకే సింగ్.