ఆయుష్మాన్ భారత్ అద్భుత పథకం : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

ఆయుష్మాన్ భారత్  అద్భుత పథకం : డబ్ల్యూహెచ్ఓ చీఫ్

గాంధీనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్  భారత్’ పై వరల్డ్ హెల్త్  ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్  జనరల్  డాక్టర్  టెడ్రోస్  అథనామ్​ ఘెబ్రియేసస్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే ఆయుష్మాన్  భారత్  అతిపెద్ద హెల్త్  స్కీం అని ఆయన కొనియా డారు. గుజరాత్ లోని గాంధీనగర్​లో జరుగుతున్న జీ20 హెల్త్ మినిస్టర్ల భేటీలో టెడ్రోస్ మాట్లాడారు. భారత్​లో హెల్త్  అండ్  వెల్ నెస్  కేంద్రాలను దర్శించానని, అక్కడ అందుతున్న సౌకర్యాలు అద్భుతమని పొగిడారు. ‘‘గాంధీనగర్​లో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లను సందర్శించాను.

 అక్కడ అందిస్తున్న వైద్యసేవలు చూసి ముచ్చటేసిం ది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న టెలిమెడిసిన్ సౌకర్యాలు కూడా బాగున్నాయి. టెలిమెడిసి న్​తో స్థానికంగా వైద్యసేవలు అందుతున్నా యి. హెల్త్ కేర్ పరివర్తన చెందుతోందని అనడానికి ఇదే గొప్ప ఉదాహరణ. గ్లోబల్ డిజిటల్ హెల్త్​ను లాంచ్ చేయడంలో చొరవ తీసుకున్నందుకు ఇండియాకు థ్యాంక్స్” అని టెడ్రాస్ వ్యాఖ్యానించారు.