తబ్లిగీ మత సమావేశాలకు అనుమతులు ఎవరిచ్చారు

తబ్లిగీ మత సమావేశాలకు అనుమతులు ఎవరిచ్చారు

ముంబై: కరోనా వ్యాపిస్తున్న టైంలో ఢిల్లీలోని ‘తబ్లిగీ జమాత్ నిజాముద్దీన్’ మత సమావేశాలకు ఎవరు అనుమతులిచ్చారని అన్నారు నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్. సోమవారం ఫేస్ బుక్ లైవ్‌లో మాట్లాడిన ఆయన… మహారాష్ట్రలోని సోలాపూర్‌లో తబ్లిగీ మతసమావేశాలు నిర్వహించుకోవడానికి  అనుమతులు కోరారని అందుకు తాము నిరాకరించామని ఆయన తెలిపారు. మరొకటి ముంబై సమీపంలో అనుమతులు కోరగా అందుకు కూడా నిరాకరించామని అయితే వాళ్లు తమ మాటను ధిక్కరించి మతసమావేశాలకు రెడీ అవడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారని చెప్పారు.  తబ్లిగీ సమావేశాల గురించి మీడియా అతిగా ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు.

కరోనా వైరస్‌పై పలు నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి అవుతున్నాయని అన్నారు పవార్. కరోనాపై ఐదు వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తే అందులో నాలుగు తప్పుడు వీడియోలేనని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే లాక్ డౌన్ వల్ల మహారాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఎప్రిల్ 15వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని అయితే ఎప్రిల్ 14న బాబాసాహెబ్ అంబెద్కర్ జయంతి వుందని అన్నారు. ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇంటిబయట క్యాండిల్ వెలిగించాలని చెప్పారు.