కొవిడ్ పరీక్షలు తగ్గడంపై డబ్ల్యూహెచ్ ఓ ఆందోళన

కొవిడ్ పరీక్షలు తగ్గడంపై డబ్ల్యూహెచ్ ఓ ఆందోళన

కరోనా మహమ్మారి విజృంభణ ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ నిత్యం కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు ప్రపంచ దేశాలను చుట్టుముడుతూ.. అక్కడ వైరస్ ఉధృతికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే వేరియంట్ ఏంటన్నదానిపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. అది ఆందోళన కలిగించే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉండాలని సూచించింది. మహమ్మారిపై పోరులో వ్యాక్సిన్ లు కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. 

కొవిడ్ పరీక్షలు తగ్గడంపై ఆందోళనకరం..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు తగ్గడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రెస్ అధనోమ్ ఘెబ్రెయేసస్ ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ పరీక్షల సంఖ్య 70 నుంచి 90 శాతం తగ్గిపోయాయనన్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదకర ఉత్పరివర్తనాలు బయటపడకుండా పోతాయని డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ హెచ్చరించారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్న డబ్ల్యూహెచ్ ఓ చీఫ్ టెడ్రోస్.. కరోనా వ్యాపించడం, మార్పులకు గురికావడం, ఎంతోమందిని చంపడం జరుగుతోందన్న వాస్తవాన్ని ఎవరూ మరిచిపోవద్దని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం..

పీకే మీతో ఉంటే గొప్పోడు.. మాతో ఉంటే తప్పా

రషీద్ ధమాకా