Prabhas vs ShahRukh: ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ వివాదం: ప్రభాస్ vs ఎస్ఆర్‌కె ఫ్యాన్స్ మధ్య వార్!

Prabhas vs ShahRukh: ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ వివాదం:  ప్రభాస్ vs ఎస్ఆర్‌కె ఫ్యాన్స్ మధ్య వార్!

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు వివాదానికి పర్యాయపదం మారింది.  ఆయన తదుపరి చిత్రం ‘స్పిరిట్’ ఒక కొత్త వివాదానికి కేంద్రమై..  సోషల్ మీడియాలో రెండు పెద్ద ఫ్యాన్ గ్రూపుల మధ్య యుద్ధానికి కారణమైంది. రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం విడుదలైన ‘స్పిరిట్’ సౌండ్ టీజర్ (sound story)లో ప్రభాస్‌ను ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ గా ప్రకటించడమే ఈ వివాదానికి మూల కారణమైంది.. ఈ ప్రకటన షారుఖ్ ఖాన్ (SRK) అభిమానులకు అస్సలు రుచించలేదు. ఇది కాస్త ప్రభాస్ vs ఎస్ఆర్‌కె ఫ్యాన్స్ వార్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.

ప్రభాస్ vs ఎస్ఆర్‌కె ఫ్యాన్స్ వార్!

‘స్పిరిట్’ మేకర్స్ విడుదల చేసిన ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో, ప్రభాస్‌ను ఆయనకు ఉన్న ‘రెబల్ స్టార్’ అనే ప్రసిద్ధ బిరుదుకు బదులుగా ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’గా పరిచయం చేశారు. ఈ ప్రకటన ప్రభాస్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తగా, షారుఖ్ ఖాన్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ‘స్పిరిట్’ అధికారిక X ఖాతాలో "అతను స్టార్స్‌లో ఒకడు కాదు. ఆయనే ఆకాశం" అనే క్యాప్షన్‌తో ఈ ప్రకటనను షేర్ చేయగా, SRK అభిమానులు దీన్ని తీవ్రంగా ఖండించారు.

 

ఒక అభిమాని తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ..  "ఎస్ఆర్‌కెనే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్. అతను గ్లోబల్ ఫినామినన్. అతనే రాజు, రాజుగానే ఉంటాడు" అని ట్వీట్ చేశారు. మరొకరు "ప్రభాస్, ఎస్‌ఆర్‌కెలో 10% కూడా కాదు, ఎస్‌ఆర్‌కె సాధించిన ఘనత దేనికీ సాటి రాదు" అని ఘాటుగా స్పందించారు. ఇంకొందరు ‘ఘంటేకా బిగ్గెస్ట్ సూపర్‌స్టార్’ అంటూ ఎస్ఆర్‌కె కుమారుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ మీమ్‌తో ఎగతాళి చేశారు.

 

 డార్లింగ్ ఫ్యాన్స్ ధీమా!

అయితే, ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరోకు ఆ బిరుదు సరైనదేనని వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ చివరి సినిమా ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు చేయడంతో, ఈ టైటిల్‌ను క్లెయిమ్ చేయడంలో తమకు తిరుగులేదంటున్నారు. "సందీప్ రెడ్డి వంగా చెప్పింది నిజమే! ప్రభాసే నిజంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్!" అని ఒక X యూజర్ రాసుకొచ్చారు. "ఈ పోస్టర్ చూసి బాంబేలోని కొందరికి రాత్రి నిద్ర పట్టదు" అంటూ మరొకరు పరోక్షంగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది.

 

ప్రభాస్ నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015) సినిమా తర్వాతనే అతన్ని ‘పాన్-ఇండియా స్టార్’గా పరిగణించడం మొదలైంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఒక అభిమాని, "2015 జూలై 10న ప్రభాస్ రాజును అధికారికంగా, ఏకగ్రీవంగా ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా ప్రకటించారు" అని ట్వీట్ చేశారు. ఈ బాక్సాఫీస్ పరుగు బాలీవుడ్ స్టార్స్‌లో అభద్రతాభావాన్ని పెంచిందని కూడా కొందరు వాదించారు.

 

పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్

ఇక ‘స్పిరిట్’ మూవీలో లో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో మాఫియా బ్యాక్‌డ్రాప్‌ కూడా ఉంటుందని సమాచారం. ప్రభాస్ కెరీర్‌లో ఇది తొలి పోలీస్ పాత్ర కావడం విశేషం. ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా దీపికా పదుకొణెను అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. పని గంటలు, పారితోషికం విషయంలో దీపిక పెట్టిన కండిషన్ల వల్లే ఈ మార్పు జరిగిందని టాక్ వినిపిస్తోంది.

 ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ (ఫాంటసీ హారర్), ‘ఫౌజీ’, ‘సలార్: పార్ట్ 2- శౌర్యాంగ పర్వం’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’ వచ్చే ఏడాది జనవరి 9, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్‌లో ప్రభాస్‌ను చూపించనుండటంతో ‘స్పిరిట్’పై అంచనాలు తారాస్థాయి చేరాయి. ఈ 'సూపర్‌స్టార్' వివాదం సినిమాకు మరింత హైప్‌ను పెంచింది. మరి వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.