
ప్రపంచ దేశాల ఐక్యవేదిక.. ఐక్యరాజ్యసమితిలో భారత్దౌత్యవేత్త పెటల్ గెహ్లాట్..భారత దేశపు సార్వభౌమత్వాన్ని, హక్కును గట్టిగా వినిపించారు. శతృదేశమైన పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పి నోరు విప్పకుండా చేసి దటీజ్ భారత్అని నిరూపించారు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత కార్యదర్శిగా ఉన్న పెటల్ గెహ్లాట్.. ఎవరీమె..
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో ప్రసంగించినప్పుడు భారత్ తరపున పెటల్ గెహ్లాట్ ధీటుగా సమాధానం చెప్పారు. శుక్రవారం యూఎన్జీఏ లో భారత్ గొంతును ధాటిగా వినిపించి ప్రపంచ దృష్టినిఆకర్షించారు.
She's Indian Diplomat @petal_gahlot posted at UN...
— Mr Sinha (@MrSinha_) September 27, 2025
She grilled Bhikharistan today 💀pic.twitter.com/ZqJcOMe9BE
మిస్టర్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ చెప్పినవన్నీ అన్నీ కట్టుకధలే.. ఉగ్రవాదాన్ని పోషిస్తూ నాటకాలు చెబుతోంది.. పాక్ ప్రధాని సభ సాక్షిగా మరోసారి ఉగ్రవాదం తప విదేశాంగా విధానంగా చెపుతున్నారు.. మీ నాటకాలు, అబద్ధాలు సత్యాన్ని కప్పి పుచ్చలేవని పెటల్ గెహ్లాట్ గర్జించారు.
ALSO READ : గోరఖ్ పూర్ నీట్అభ్యర్థి హత్య కేసు..
ఎవరీ పెటల్ గహ్లోట్..
పెటల్ గహ్లోట్ జూలై 2023లో ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత మిషన్‌లో మొదటి కార్యదర్శిగా చేరారు. ఆమె దౌత్య ప్రయాణం సంవత్సరాల పాటు కొనసాగింది. ఆమె గతంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. 2020 నుంచి 2023 వరకు యూరోపియన్ వెస్ట్ డివిజన్‌కు నాయకత్వం వహించారు. ఆ సమయంలో పారిస్ ,శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత మిషన్లలో కూడా పనిచేశారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.
దౌత్యరంగంలో దిట్ట అయిన గెహ్లాట్‌లో మరోకోణం కూడా ఉంది.. ఆమె స్వతహాగా సంగీత విద్వాంసురాలు. ఆమె గిటార్ వాయించే వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంది. గెహ్లాట్ కు సంబంధించిన LP పాడిన బెల్లా సియావో ,లాస్ట్ ఆన్ యు పాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆదరణ పొందుతున్నాయి.
ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రం ,ఫ్రెంచ్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు పెటల్ గెహ్లాట్. ఆ తర్వాత ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో రాజనీతి శాస్త్రం ,ప్రభుత్వంలో ఎంఏ పట్టా పొందారు. మాంటెరీలోని మిడిల్‌బరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి భాషా అనువాదంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు పెటల్ గెహ్లాట్.