సివంగి అనే మాట వినే ఉంటారు. జూలు తిరిగిన మగ సింహాలను సైతం లెక్క చేయకుండా పోరాడే ఆడ సింహాన్ని అలా అంటారు. అలాంటి తెగువ చూపించింది ఈ యువతి. ఒకవైపు వర్షం కురుస్తోంది. పోలీసుల భయానికి ప్రొటెస్టర్లు అంతా సైడ్ అయిపోయారు. కొంత మంది విద్యార్థులను వ్యాన్ లో వేసుకుని వెళ్తున్నారు పోలీసులు. అప్పుడు వచ్చింది ఈ యువతి. ఒక్కతి అంటే ఒక్కతే.. దమ్ముంటే నన్ను దాటి వెళ్లండి అంటూ ఎదురు నిలిచింది. ఒక చేతితో వ్యాన్ ను ఆపుతూ.. దాదాపు 40 నిమిషాలు ఒంటరి పోరాటం చేసింది. యువతి ధైర్యానికి పోలీసులు కూడా సైలెంట్ అయిపోయారు. ముంబైలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో యువతి చూపిన తెగువ ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఈ యువతి పేరు రియా అహిర్.. నిరసనకారులను తీసుకెళ్తున్న వ్యాన్ ను అడ్డుకొని అందరిని షాక్ గురి చేసింది. నిరసనకారులను అరెస్ట్ చేసేందుకు వారెంట్ లు ఉన్నాయా అంటూ పోలీసులను దైర్యంగా ప్రశ్నించింది రియా అహిర్. నిరసనలో పాల్గొనేందుకు తన ఫ్రెండ్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న వ్యాన్ అడ్డుకుంది వ్యాన్ ను అడ్డుకుంది రియా. వ్యాన్ ను అడ్డుకున్న సమయంలో డ్రైవర్ వ్యాన్ ముందుకు కదిలించే ప్రయత్నం చేశాడని... వ్యాన్ లో ఉన్న ప్రొటెస్టర్లను వదిలేంతవరకు ఇక్కడి నుంచి కదలనని చెప్పి నిలబడ్డానని తెలిపింది రియా.
We’re not scared. We will not stop till Dharmendra Pradhan resigns! pic.twitter.com/MC4dw4Z8ET
— Cockroach is Back (@Cockroachisback) July 23, 2026
వ్యాన్ స్పీడ్ పెంచి తనను భయపెట్టేందుకు ప్రయత్నించారని... నిరసన తెలిపితే నేరస్తుల్లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోకపోతే.. తప్పు చేశాననే భావన తనను వెంటాడేదని.. పోలీసులు తమ పని బాధ్యతాయుతంగా చేయలేదని ఆరోపించింది. తాను స్టూడెంట్ ని కాదని.. రైతు కుటుంబం నుంచి వచ్చానని తెలిపింది. మన దేశ పౌరుల కోసం మనం బాధ్యత తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించింది.
ALSO READ : స్టూడెంట్స్ను పోలీసులతో కొట్టించడం దారుణం..
రియా అహిర్ ఎవరు?
రియా ఆహిర్ ఒక నటి, మోడల్, వ్యాపారవేత్త. ఆమెకు ఇన్స్టాలో సుమారు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె దిల్బారాతో సహా పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది.
ఈ వీడియోతో పాటు వైరల్ గా మారిన మరో వీడియోలో ప్రొటెస్టర్లు ఒక పోలీస్ వ్యాన్ ను తరుముతూ దాని వెనుక డోర్ ని ఓపెన్ చేయగా.. లోపల ఉన్న ప్రొటెస్టర్లు వ్యాన్ నుంచి బయటికి వస్తున్నారు
