
ఎలక్ట్రిఫైయింగ్ టిల్లు స్క్వేర్ (Tillu Square) ట్రైలర్ చూశారు కదా..టిల్లు గాడు..డబుల్ టైం పిచ్చెకించే విధంగా..డబుల్ టైం నవ్వుకునే విధంగా ఈ నెల మార్చి 29న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ స్వాగ్, హీరోయిన్స్‌తో రొమాంటిక్ యాంగిల్స్ ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
టిల్లు అనేటోడు..నార్మల్ టిల్లు అయితే కాదు..నేనొక కారణజన్ముడిని. నా ఈ జన్మకు కారణం ఏంటంటే..ఈ ఊర్లో ఎన్ని పంచాయితీలున్నాయి..? ఎన్ని లేడీస్ పంచాయితీలున్నాయి అంటూ మరింత దగ్గరయ్యాడు.
ఈ సినిమాకు రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వచ్చిన 'రాధికా..రాధికా..ముందుకా..వెనుకాక..'రింగుల జుట్టు చూసి పడిపోయానే..నీ మాటలు విని పడిపోయానే..నీ గాలి సోకితేనే సచ్చిపోయానే' అనే సాంగ్‌తో యూత్‌లో మంచి జోష్ తీసుకొచ్చారు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్.
అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటే ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే, ‘డీజే టిల్లు’ సినిమాకు ఎస్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు కూడా ఆయనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తారని అంతా భావించారు. కానీ, ఇప్పుడు తమన్ స్థానంలో మరో ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపారట మేకర్స్.అతనెవరో కాదు..ధమాకా, బలగం,మ్యాడ్ వంటి సినిమాలతో టాప్ హిట్స్ అందుకున్న..భీమ్స్ సిసిరోలియో. టిల్లు రికార్డింగ్ వర్క్ మీద బిజీగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ మరియు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య టిల్లు స్క్వేర్’ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాతలు తీసిన ‘మ్యాడ్’ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించారు. అది బాక్సాఫీస్ హిట్ సాధించింది. సాంగ్స్ తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ సినిమాను సైతం భీమ్స్ చేతిలో పెట్టారు మేకర్స్. మరి ఎలాంటి హీట్ పెంచుతాడో సి చూడాలి.
డీజే టిల్లు మూవీతో ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దు జొన్నలగడ్డ..ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘టిల్లు స్క్వేర్’ కాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే మూవీ చేస్తున్నాడు. మరోవైపు నీరజ కోన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘తెలుసు కదా’ మూవీలోను నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశి ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.