కరోనా వైరస్ కొత్త రకానికి పేరు పెట్టిన డబ్ల్యూహెచ్ఓ

కరోనా వైరస్ కొత్త రకానికి పేరు పెట్టిన డబ్ల్యూహెచ్ఓ

సౌతాఫ్రికాను వణికిస్తున్న కరోనా వైరస్ తాజా వేరియంట్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ గా పేరు పెట్టింది. ఈ రకం కరోనా వైరస్ జనాల్లో వేగంగా వ్యాప్తిస్తోందని, ప్రపంచ దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ మ్యుటెంట్ క్షణాల వ్యవధిలోనే అత్యంత వేగంగా మార్పులు చేందుతూ ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేస్తోందని తెలిపింది. ఇజ్రాయిల్, బెల్జియం పరిసరాల్లో ఉన్న సౌతిఫ్రికన్లలో కరోనా కొత్త రకం వేరియంట్ ను గుర్తించారు. కొత్త వేరియంట్ లో మార్పులు అనూహ్యంగా మారిపోతున్నట్లు సౌతాఫ్రికా సైంటిస్టుల పరీక్షల్లో తేలింది. రక్త నాళాల్లో చేరే ఈ వైరస్ 30 రకాలుగా మార్పులు చెందుతుందని బ్రిటన్ సైంటిస్టులు గుర్తించారు. ఈ మ్యుటెంట్ డెల్టా వేరియంట్ కు రెట్టింపు స్థాయిలో ప్రభావం చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మ్యుటెంట్ గురించి తెలుసుకోవడానికి ఇప్పటికే పలు దేశాలకు చెందిన సైంటిస్టులు పరిశోధనలు ప్రారంభించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన చేసింది. కాగా.. గతంలో ఆల్ఫా, బీటా, గామా, డెల్టాలుగా వ్యాప్తిచెందిన కరోనా వైరస్.. ఇప్పుడు ఒమిక్రాన్ గా వ్యాప్తి చెందుతోంది.