కరోనా కట్టడికి డబ్ల్యూహెచ్‌‌వో యాప్

కరోనా కట్టడికి డబ్ల్యూహెచ్‌‌వో యాప్

కాలిఫోర్నియా: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా యాప్ ను డెవలప్ చేస్తోంది. ప్రజలు తమ సింప్టమ్స్ ఆధారంగా తమకు కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు దీన్ని రూపొందిస్తోంది. అదే విధంగా ఎవరికైనా పాజిటివ్ వస్తే, అంతకుముందు ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్లిన వారందరికీ నోటిఫికేషన్ వెళ్లేలా యాప్ ను తయారు చేస్తోంది. బ్లూటూత్ ఆధారంగా ఇది పని చేయనుంది. కాంటాక్ట్ ట్రేసింగ్ ను ఈజీ చేసేందుకు ఇందులో కొత్త ఫీచర్ ను యాడ్ చేస్తున్నారు. యాప్ ను ఈ నెలలోనే లాంచ్ చేయనున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చీఫ్​ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ బెర్నార్డో మారియానో తెలిపారు. యాప్ ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని, ఏ దేశమైనా ఈ టెక్నాలజీ ఆధారంగా తమకు అవసరమైన ఫీచర్స్ ను యాడ్ చేసుకొని సొంతంగా రిలీజ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా, బ్రిటన్ అఫీషియల్ యాప్స్ ను రిలీజ్ చేశాయని పేర్కొన్నారు. సొంతంగా యాప్స్ ను డెవలప్ చేసుకోలేని సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మారియానో చెప్పారు. సింప్టమ్ చెకర్ లో కొన్ని టూల్స్ యాడ్ చేస్తున్నామని, మెంటల్ హెల్త్ కేర్ కోసం ఇందులో గైడెన్స్ ఇస్తామని పేర్కొన్నారు. యాప్ ను డెవలప్ చేసేందుకు కొంతమంది డిజైనర్లు స్వతంత్రంగా ముందుకొచ్చారని.. యాపిల్, గూగుల్ కలిసి దీన్ని రిలీజ్ చేస్తాయని మారియానో వెల్లడించారు.