వ్యాక్సిన్లకే సుమారు రూ.7 లక్షల 47 వేల కోట్లు కావాలి

V6 Velugu Posted on Aug 12, 2020

కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే కేవలం వ్యాక్సిన్ల తయారీకే పది వేల కోట్లడాలర్లు (సుమారు రూ.7 లక్షల 47 వేల కోట్లు) కావాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. ఇప్పటిదాకా వ్యాక్సి న్లతయారీపై ఇన్వెస్ట్ ,,,చేసింది జస్ట్10 శాతం మాత్రమే నన్నారు. వ్యాక్సి న్ల తయారీలో ప్రైవేటు, ప్రభుత్వభాగస్వామ్యం అవసరమన్నారు. ప్రస్తుతం 160 దేశాల్లో గ్లోబల్వ్  వ్యా క్సిన్స్  ఫెసిలిటీ పనిచేస్తోందన్నారు.

ఏ వ్యాక్సిన్ అయినా సరే దానికి డబ్ల్యూహెచ్వో అప్రూవల్ స్టాంప్ ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ‘‘వ్యాక్సిన్‌కు ప్రీ క్వాలిఫికేషన్‌ అప్రూవల్‌పై రష్యా హెల్త్ అధికారులతో మేం చర్చలు జరుపుతున్నాం. వ్యాక్సిన్కు ఆమోద ముద్ర పడాలంటే దాని సేఫ్టీపై చాలా లోతుగా రివ్యూ చేయాల్సి ఉంటుంది. దాని ప్రభావాన్ని తేల్చాల్సి ఉంటుంది. దానికి చాలా టైం పడుతుంది’’ డబ్ల్యూహెచ్వో అధికారి తారీక్ జెసారెవిక్ అన్నారు. ‘‘ప్రతి దేశానికీ నేషనల్ రెగ్యులేటరీ ఏజెన్సీలుంటాయి. అయితే, ఏ దేశంలోనైనా సరే వ్యాక్సిన్లు , మందులకు డబ్ల్యూహెచ్వో ప్రీ క్వాలిఫికేషన్అవసరం. అది క్వాలిటీకి సర్టిఫిర్టి కెట్లాంటిది. అది కావాలంటే ఏ వ్యాక్సిన్ అయినా సరే క్లినిక్లికల్ ట్రయల్స్లో వచ్చిన ఫలితాలు, సేఫ్టీ, ఎఫికసీపై మా సైంటిస్టులు లోతుగా రివ్యూ చేయాల్సి ఉంటుంది’’ అని తారీక్ చెప్పారు.

Tagged WHO, crores, 47 thousand, Rs 7 lakh, vaccines need

Latest Videos

Subscribe Now

More News