కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​వో బ్రేక్

కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​వో బ్రేక్
  • తయారీ ఫెసిలిటీల్లో లోపాలున్నాయని వెల్లడి
  • సరిచేసుకునేందుకే నిర్ణయమని ప్రకటన

న్యూఢిల్లీ: భారత్​ బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ కొవాగ్జిన్​ సరఫరాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సస్పెండ్​ చేసింది. మార్చి 14 నుంచి 22 మధ్య సంస్థకు చెందిన వ్యాక్సిన్​ తయారీ ఫెసిలిటీలను పరిశీలించామని, అందులో లోపాలున్నాయని డబ్ల్యూహెచ్​వో చెప్పింది. ఆ లోపాలను సరిచేసుకునేందుకు ప్రస్తుతానికి కొవాగ్జిన్​ సరఫరాను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. అయితే, వ్యాక్సిన్​ పనితనంలో ఎలాంటి లోపాలు లేవని, టీకా బాగానే పనిచేస్తోందని, ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. డబ్ల్యూహెచ్​వో ప్రకటనపై భారత్​ బయోటెక్​ స్పందించింది. వ్యాక్సిన్​ పనితనం, సేఫ్టీపై ఆందోళనలు అవసరం లేదని తెలిపింది. ఇప్పటికే కొవాగ్జిన్​ తీసుకున్నోళ్ల సర్టిఫికెట్లు చెల్లుబాటవుతాయని పేర్కొంది. 

చైనాలో కేసులు మళ్లీ పెరుగుతున్నయ్​

ప్రపంచమంతటా కరోనా కేసులు తగ్గుతున్న వేళ చైనా, బ్రిటన్, సౌత్ కొరియా వంటి పలు దేశాల్లో మాత్రం కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చైనాలో ఆదివారం ఒక్కరోజే 13,146 కొత్త కేసులు నమోదయ్యాయి. షాంఘైలోనే 70% మంది బాధితులున్నారు. బ్రిటన్​లో వారంలోనే 49 లక్షల మంది మహమ్మారి బారిన పడినట్టు అక్కడి అధికారులు చెప్తున్నారు. సౌత్ కొరియాలోనూ రోజూ 2 లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు.