లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా మళ్లీ విజృంభిస్తుంది

లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా మళ్లీ విజృంభిస్తుంది
  • వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన

జెనీవా : కరోనా పై ఫైట్ లో భాగంగా ఇన్నాళ్లు కఠినంగా లాక్ డౌన్ విధించిన ప్రపంచ దేశాలు నెమ్మదిగా పట్టు సడలించటంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాను పూర్తిగా నివారించే వరకు లాక్ డౌన్ విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహారించాలని (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కోరారు. జెనీవాలో జరిగిన వర్చువల్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన కరోనా పై ఫైట్ విషయంలో పలు దేశాలు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయని చెప్పారు. లాక్ డౌన్ సడలింపులు ఇస్తే కరోనా మళ్లీ విజృంభిస్తుందని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తి తగ్గితేనే దశల వారీగా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వాలని సూచించారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ పలు దేశాల లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేశారు. ఇటలీ, స్పెయిన్ లలోనూ లాక్ డౌన్ సడలింపులు ప్రారంభించాయి. కరోనా మరణాలు పెరిగే చాన్స్ ఉన్నప్పటికీ వేరే మార్గం లేదంటూ లాక్ డౌన్ ఎత్తివేతపై ట్రంప్ కామెంట్ చేశారు. కరోనా నివారణ విషయంలో డబ్ల్యూహెచ్ ఓ సూచనలను చాలా దేశాలు పట్టించుకోవటం లేదని ఇప్పటికే టెడ్రోస్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.