
జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ ప్రెస్ మీట్లో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వంపై సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకత్వ శూన్యత ఉందని మార్పు అవసరమని కేజ్రీవాల్ అన్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్..రాబోయే రోజుల్లో కాషాయ దళపతి ఎవరని ప్రశ్నించారు. ఎన్డీయే కూటమిని ప్రజలు అడుగున్నారు..మీ కాబోయే ప్రధాని ఎవరని సమాధానం చెప్పాలని అన్నారు. ప్రధాని మోదీ మరికొద్ది రోజుల్లో 75 ఏళ్ల నిండుతాయి..ఆయన రిటైర్ అవుతారు..ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రధాని ఎవరని అన్నారు.
సెప్టెంబర్17 నాటికి ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతున్నాయి. బీజేపీ పార్టీ విధానం ప్రకారం..75 ఏళ్ల తర్వాత ఆ పార్టీ నేతలు రిటైర్ అవుతారన్నారు. ఎల్ కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, సుమిత్ర మహాజన్, యశ్వంత్ సిన్హా పదవి విరమణ చేశారు. సెప్టెంబర్ 17 తర్వా త ప్రధాని మోదీ విమరణ చేయాలని కేజ్రీవాల్ అన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే యూపీ సీఎం యోగిని పక్కకు తప్పించడం, హోంమంత్రి అమిత్ షాను ప్రధాని చేయడం లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని మోదీ హా మీలను అమిత్ షా అమలు చేస్తారా అని ప్రశ్నించారు.
బీజేపీ హాయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు జైలు తప్పవని కేజ్రీవాల్ అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షాలను అణిచివేస్తూ నియంతృత్వ ధోరణి, అవినీతిని ప్రోత్సహిస్తోందన్నారు. అధికార పార్టీ కి వ్యతిరేకంగా దేశం ఏకం కావాలని కోరారు.