
తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగినా.. గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు బీఆర్ఎస్కు జైకొట్టారు.ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న సెటిలర్లంతా బీఆర్ఎస్ మద్దతు పలికారు. గత ఎన్నికల్లో గెలిచిన అన్ని సీట్లను బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. గ్రేటర్ పరిధిలోని దాదాపు మూడో వంతు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేసిన అభివృద్దే ఆ పార్టీకి గెలిపించాయి. సిటీలో నిరంతర విద్యుత్, తాగునీరు, ప్రజారవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పన బీఆర్ ఎస్ ను నగర ప్రజలకు దగ్గర చేశాయని తెలుస్తోంది. జీహెచ్ ఎంసీ పరిధిలో గ్రీనరీ, నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి , ఉపాధి వంటివి గ్రేటర్ ప్రజలను ఆకట్టున్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ ఎస్ హవా కొనసాగింది. నగరంలో మొదట అంబర్ పేట్ ను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఆ తర్వాత శేరిలింగంపల్లి, సనత్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ముషీరాబాద్, ఖైరాతాబాద్, కూకట్పల్లి లలో విజయం సాధించింది. ఎంఐఎం పార్టీ తన సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. గోషామహల్ నుంచి వరుసగా మూడో సారి రాజాసింగ్ బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాని అందరూ ఊహించినా..అంచనాలు మారాయి..ఎంఐఎం అభ్యర్థి నాంపల్లిలో గెలుపొందారు.
జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాలనుంచి పాఠం నేర్చుకున్న బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలోని అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడంతో ఆ పార్టీకి ప్లస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీ ఓట్లు చీల్చడం కూడా బీఆర్ఎస్కు కలిసొచ్చిందని తెలుస్తోంది.