భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి: కొలంబియాలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి: కొలంబియాలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు

కొలంబియా: కొలంబియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను టార్గెట్ చేశారు. భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరగుతోందని రాహుల్‌ ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై దాడి భారతదేశానికి అతిపెద్ద ముప్పని రాహుల్‌ అభిప్రాయపడ్డారు. కొలంబియాలో EIA యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనకు స్వేచ్ఛ ఇచ్చిందని.. కానీ ప్రస్తుతం భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై హోల్సేల్ అటాక్ జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారు.

ఇంజనీరింగ్, వైద్య భద్రత రంగాల్లో భారతదేశానికి వృద్ధి సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. అయితే.. అదే సమయంలో, భారత్లో వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉందని, భారతదేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ప్రస్తుతం అతి పెద్ద సవాల్ అని రాహుల్ తెలిపారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. రాహుల్‌ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. విదేశాలకెళ్లి దేశాన్ని కించపరచడం రాహుల్‌కు అలవాటే అని బీజేపీ కౌంటర్‌ ఇచ్చింది.