15 నెలల గరిష్టానికి హోల్‌‌సేల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌

15 నెలల గరిష్టానికి హోల్‌‌సేల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌
  • ఆహార పదార్ధాలు, కూరగాయల ధరలు పెరగడమే కారణం

న్యూఢిల్లీ : హోల్‌‌సేల్ ధరల పెరుగుదలను కొలిచే  హోల్‌‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)  కిందటి నెలలో 15 నెలల గరిష్టానికి చేరుకుంది. హీట్‌‌వేవ్స్ కారణంగా ఆహార పదార్థాలు, ఉల్లి, బంగాళదుంపలు వంటి కూరగాయల ధరలు, పరిశ్రమల్లో తయారైన ప్రొడక్ట్‌‌ల ధరలు   పెరగడమే ఇందుకు కారణం.   డబ్ల్యూపీఐ  కిందటి నెలలో 2.61 శాతానికి పెరిగింది. కిందటేడాది మే నెలలో  మైనస్ 3.61 శాతంగా నమోదైన హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌, ఈ ఏడాది ఏప్రిల్‌‌లో 1.26 శాతంగా ఉంది.  

ఆహార పదార్ధాలు, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్‌‌, మినరల్ ఆయిల్స్‌‌, ఇతర తయారీ ప్రొడక్ట్‌‌ల ధరలు పెరగడంతో కిందటి నెలలో ఇన్‌‌ఫ్లేషన్ పెరిగిందని కామర్స్ మినిస్ట్రీ శుక్రవారం పేర్కొంది. డేటా ప్రకారం, ఆహార పదార్ధాల హోల్‌‌సేల్ ధరల పెరుగుదలను కొలిచే ఇన్‌‌ఫ్లేషన్ కిందటి నెలలో 10 నెలల గరిష్టమైన 9.82 శాతానికి  చేరుకుంది. వెజిటబుల్స్ ఇన్‌‌ఫ్లేషన్ 32.42 శాతానికి పెరిగింది.  గ్లోబల్‌‌గా  మెటల్స్ ధరలు పెరగడంతో  తయారీ  ప్రొడక్ట్‌‌ల రేట్లు పెరుగుతున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు.