
న్యూఢిల్లీ: హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్ జనవరిలో మూడు నెలల కనిష్టానికి తగ్గింది. కిందటి నెలకు గాను హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) 0.27 శాతంగా నమోదయ్యింది. కిందటేడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు డబ్ల్యూపీఐ నెగెటివ్ జోన్‌లో రికార్డయ్యింది. కిందటేడాది జనవరిలో ఈ ఇండెక్స్ 4.8 శాతంగా, డిసెంబర్‌లో 0.73 శాతంగా నమోదయ్యింది.
జనవరిలో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 6.85 శాతానికి తగ్గింది. కిందటేడాది డిసెంబర్‌లో 9.38 శాతంగా ఉంది. ఫుడ్ సెగ్మెంట్‌లో కూడా కూరగాయల ధరలు బాగా తగ్గాయి. డిసెంబర్‌లో 26.3 శాతంగా ఉన్న ఈ సెగ్మెంట్ ఇన్‌ఫ్లేషన్, జనవరిలో 19.71 శాతానికి తగ్గింది. పండ్లు, గుడ్లు, పాలు, చేపల ధరలు దిగొచ్చాయి.