అదుపులోనే హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ ధరలు

అదుపులోనే హోల్‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌ ధరలు

న్యూఢిల్లీ: హోల్​సేల్​ఇన్​ఫ్లేషన్ (ధరలు)​ సెప్టెంబరులో వరుసగా ఆరవ నెలలో మైనస్‌‌‌‌‌‌‌‌ 0.26 శాతం వద్ద నెగెటివ్​గానే కొనసాగింది. ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గాయి. టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ) ఆధారిత ఇన్​ఫ్లేషన్​ రేటు ఏప్రిల్ నుంచి నెగెటివ్​గానే ఉంది.  ఆగస్టులో మైనస్​ 0.52 శాతంగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 10.55 శాతంగా ఉంది. ఆహార ధరల్లో వేగంగా తగ్గుదల కారణంగా డబ్ల్యూపీఐ నెగెటివ్​గా ఉందని నిపుణులు తెలిపారు.

 గత రెండు నెలల్లో రెండంకెల్లో కొనసాగిన ఆహార వస్తువుల ఇన్​ఫ్లేషన్​ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.35 శాతానికి తగ్గింది. ఆగస్టులో ఇది 10.60 శాతంగా ఉంది. కూరగాయల ఇన్​ఫ్లేషన్ ​ఆగస్టులో 48.39 శాతం నుంచి మైనస్​15 శాతానికి తగ్గింది. బంగాళదుంప ఇన్​ఫ్లేషన్  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 25.24 శాతంగా ఉంది. అంతకుముందు నెలలో 24.02 శాతంగా ఉంది. అయితే గత నెలలో పప్పులు, ఉల్లిపాయలు, పాలు,  పండ్ల వంటి ఆహార పదార్థాల ధరలు కొంత పెరగడం కనిపించింది. 

పప్పు దినుసుల ఇన్​ఫ్లేషన్​ 17.69 శాతం కాగా, ఉల్లి 55.05 శాతం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎనర్జీ,  పవర్ బాస్కెట్ ఇన్​ఫ్లేషన్​ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3.35 శాతంగా ఉంది, ఆగస్టులో 6.03 శాతంగా ఉంది. తయారు చేసిన ఉత్పత్తులలో ఇన్​ఫ్లేషన్​ రేటు 1.34 శాతం, ఆగస్టులో 2.37 శాతం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రధానంగా  రసాయన ఉత్పత్తులు, మినరల్ ఆయిల్స్, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్, బేసిక్ మెటల్స్,   ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు తగ్గాయని కేంద్ర వాణిజ్య  పరిశ్రమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది.