
చెన్నై: తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తికి ఎలక్షన్ కమిషనే కారణమని మద్రాసు హైకోర్టు ఘాటుగా విమర్శించింది. ర్యాలీలు, సభలు ఎందుకు ఆపలేకపోయారని ఎలక్షన్ కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కేసుల పెరుగుదలకు అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై మర్డర్ కేసు పెట్టాలంటూ సీరియస్ అయ్యింది. కౌంటింగ్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో బ్లూ ప్రింట్ ఇవ్వాలని ఆదేశించింది. మే 2న కౌంటింగ్ రోజు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే ఎన్నికలు రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.