ఐదేండ్లలో పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలే

ఐదేండ్లలో పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలే
  •  ఎంపీ అర్వింద్ ను ప్రశ్నించిన జీవన్ రెడ్డి 

నిజామాబాద్, వెలుగు: ధర్మపురి అర్వింద్‌‌‌‌ను ఎంపీగా గెలిపిస్తే పెద్ద నాయకులతో పరిచయాలు పెంచుకొని ప్రజలను పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. అర్వింద్ కల్వకుంట్ల కవితను ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్​ పేపర్‌‌‌‌కు ఐదేండ్లయినా దిక్కులేదన్నారు. నిజామాబాద్‌‌‌‌ను స్మార్ట్​ సిటీగా ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ఆర్మూర్​ఆదిలాబాద్​, బోధన్,​- బీదర్​రైల్వే లైన్‌‌‌‌ వేయించడంలో ఫెయిల్​అయ్యారన్నారు.

 తాను గెలిచాక నగరంలో గవర్నమెంట్​ మహిళా డిగ్రీ కాలేజీ, ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​ కాలేజీలు ఏర్పాటు చేయిస్తానని, స్మార్ట్​ సిటీ చేసి ఆగస్టు నాటికి మహిళల కోసం సిటీ బస్​ సౌలత్‌‌‌‌  కల్పిస్తానన్నారు. 2008లోనే తాను జగిత్యాలలో మామిడి మార్కెట్​ ఏర్పాటు చేయించానన్నారు.  త్యాగాల చరిత్రగల కాంగ్రెస్​తో బీజేపీకి ఎప్పటికీ పోలిక ఉండదన్నారు. ఉర్దూ అకాడెమీ చైర్మన్ తాహెర్​, నగర పార్టీ ప్రెసిడెంట్​కేశవేణు తదితరులు ఉన్నారు.