ఈడీ, సీబీఐ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదు

ఈడీ, సీబీఐ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదు

హరిద్వార్: ఉత్తరాఖండ్ లో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రులను ఎందుకు మార్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారంతా అవినీతిపరులని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, 500 రూపాయలకే LPG సిలిండర్, పేదలకు న్యాయ్ పథకం కింద ఏడాదికి 40వేలు అందిస్తామన్నారు. రాహుల్ వినిపించుకోడన్న ప్రధాని మోడీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ED, CBI ఒత్తిళ్లకు తాను లొంగబోనని... అలాంటప్పుడు మోడీ మాటలు ఎందుకు వినాలన్నారు రాహుల్. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు రాహుల్.