హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు మాజీ మంత్రి హరీశ్ రావు ఎందుకు స్పందించరని లైవ్‌స్టాక్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు సాయం చేయడం లేదని, దీనిపై హరీశ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై మాట్లాడేటప్పుడు హరీశ్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా కాళేశ్వరం కట్టి ఆదిలాబాద్‌ను ఎండబెట్టారని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని అధికారం కోసం చేపట్టారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు 30 శాతం కూడా పూర్తికాకుండానే 90 శాతం పూర్తయిందని బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
